నవతెలంగాణ – నెల్లికుదురు
బీఆర్ఎస్ పార్టీ లో ఒకరిద్దరు ఇసుక తోలుకుంటే పోలీసులు ట్రాక్టర్లను తీసుకెళ్లి రోజులకొద్దీ నిర్బంధిస్తున్నారని అలానే కాంగ్రెస్కి చెందినవారు ఇసుకను తోలుకుంటే అధికారులు చూసి చూడనట్టుగా పోలీసులు వ్యవహరస్తున్నారని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావ్ ఆ పార్టీ మండల అధ్యక్షుడు అరుపాటి వెంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చెందినవారు కొంతమంది ఆక్రమంగా ఇసుకను రవాణా చేస్తుంటే వారిని అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఇసుకను తోలుకుంటే వారిని తీసుకెళ్లి మరి ట్రాక్టర్లను రోజులకొద్దీ నిర్బంధించి వారిని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అధికారులు మా పార్టీ నాయకులను ఇబ్బందులు పెడుతుంటే మా దాంట్లో ఒకరిద్దరు ఇసుక తోలుకునేవారు కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోయారని తెలిపారు. మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోయారు అని వారిని అడిగితే ఈ సమాధానం ఇచ్చారని తెలిపారు. ఇలా చేస్తే తాసిల్దార్ కార్యాలయం ముందు పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేస్తామని అన్నారు. కాంగ్రెస్ సహాయం లోనే ఆక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని తెలిపారు. పేదలను పట్టించుకోవడంలో విఫలం చదువుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ శ్రీనివాస్ మురళి భీముడు అనిల్ భోజియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.