పతకాలు సాధించినందుకు సంతోషంగా వుంది : నీరజ్‌

నవతెలంగాణ- హంగేరి : హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగిన అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా బంగారు పతకం సాధించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పొరుగు దేశమైన పాకిస్తాన్‌కి చెందిన అర్షద్‌ నదీమ్‌ రజత పతకం సాధించారు. ఈ సందర్బంగా నీరజ్‌, అర్షద్‌ మీడియాతో మాట్లాడుతూ… ఈ ఈవెంట్‌ తర్వాత నేను అర్షద్‌ నదీమ్‌ని కలిశాను. భారత్‌, పాకిస్తాన్‌ రెండు దేశాలు క్రీడా రంగంలో పురోగతి సాధిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామని, అలాగే ఎంతో బలమైన, పోటీతత్వం ఉన్న యూరోపియన్‌ ప్రత్యర్థులపై విజయం సాధించినందుకు మరింత సంతోషంగా ఉందని అన్నారు. క్రీడల్లో భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య పోటీ ఎప్పుడూ ఉంటుందని, ఈ విజయం ఆసియన్‌ గేమ్స్‌లో మా ఆటతీరుపై మరింత ప్రభావం పడుతుంది. మేము మళ్లీ హాంగౌజ్‌లో కలుస్తామని నీరజ్‌ అన్నారు. కాగా, ఈ సందర్భంగా ప్రధాని మోడీ నీరజ్‌కి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్‌లో ‘నీరజ్‌ చోప్రా అకిత భావం, ఖచ్చితత్వం, అభిరుచి అన్ని అథ్లెటిక్స్‌లో ఛాంపియన్‌గా మాత్రమే కాదు.. మొత్తం క్రీడా ప్రపంచంలోనే అసమాన ప్రతిభకు చిహ్నంగా నిలుస్తారు’ అని ట్వీట్‌ చేశారు.

Spread the love