మహిళల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదు

– ఆసుపత్రిలో బయోమెట్రిక్  ఏర్పాటు చేయాలి
– భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ 
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండటం లేదని, గర్భిణీ, ప్రసూతి స్త్రీలకు క్రమంగా చూడవలసిన వైద్యులు మహిళల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ప్రసూతి మహిళలకు న్యూట్రిషన్ కిట్లు సరైన సమయంలో అందరికి అందడంలేదన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డిప్రోత్సాహంతోనే వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే వంతుల వారిగా విధులకు హాజరై  ప్రజా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో బయోమెట్రిక్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా ఆరోగ్యం పట్ల అంకితభావం నిబద్ధతతో పనిచేయాలని లేకుంటే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనకు సిద్ధం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మహిళా సమాఖ్య జిల్లా నాయకురాల్లు నేలవేని స్వప్న, పెద్ది నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Spread the love