నేషనల్ స్కాలర్ షిప్ పరీక్షలో సత్తా చాటిన నెమ్లి

నవతెలంగాణ – నసురుల్లాబాద్
కామారెడ్డి జిల్లా నసురుల్లా బాత్ మండలంలోని నెమ్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్ పరీక్షల్లో సత్తా చాటారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నెమ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షలలో ప్రతిభ కనబరచి జాతీయ ప్రతిభా స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ వెంకట్ రమణ తెలిపారు. ప్రతిభా స్కాలర్షిప్ కు ఎంపికైన ముగ్గురు విద్యార్థులు 1,గంపల బాలాజీ , 2, ఆకుల హర్షిణి, 3, చాకలి హర్షవర్ధన్ లు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా అభినందించారు. నెమ్లి హై స్కూల్ నుంచి ప్రతి సంవత్సరం జాతీయ స్కాలర్షిప్ ఎంపిక కావడం పట్ల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు , ఉపాధ్యాయులను, విద్యార్థులనుఅభినందించారు. స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరమునకు 12 వేల చొప్పున 5 సంవత్సరాలపాటు స్కాలర్షిప్ అందిస్తారని ప్రిన్సిపల్ తెలిపారు తెలిపారు.

 

Spread the love