తెలంగాణలోకి కొత్త బీర్లు..

నవతెలంగాణ – హైద‌రాబాద్ : ఈ మధ్య వైన్ షాపుల్లో ఎక్కడ చూసినా బీర్ల కొరత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అసలే ఎండాకాలం కావడంతో మందుబాబులు బీర్లు దొరక్కా నానా అవస్ధలు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కిక్కిచ్చే శుభవార్త చెప్పింది. ఇప్పటిదాకా కేఎఫ్ లైట్, కేఎఫ్ స్ర్టాంగ్ బీర్లు ఎక్కువగా సేల్ అవుతున్న క్రమంలో తెలంగాణ‌లోకి కొత్త బీర్లు రాబోతున్నాయి. రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సోమ్ డిస్టిల‌రీస్ ప్రభుత్వ అనుమ‌తి పొందింది. ఇక ప‌వ‌ర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంట‌ర్, వుడ్ పీక‌ర్ బీర్లు కూడా అందుబాటులోకి రానున్నాయని సమాచారం.

Spread the love