తెలంగాణలో ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో ఆగస్టు 1 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు కొత్త ఛార్జీలు అమలు కానున్నాయి. భూముల మార్కెట్ విలువ సవరణపై స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. జులై 1న కొత్త ఛార్జీలను నిర్ధారించనుంది. సలహాలు, అభ్యంతరాల పరిశీలన పూర్తయ్యాక తుది మార్కెట్ విలువను ఖరారు చేయనుంది. ఆయా ప్రాంతాల్లో స్థలాల వాస్తవిక ధరలను బట్టి మార్కెట్ విలువను నిర్ణయించనుంది.

Spread the love