పపువా న్యూగినియాపై న్యూజిలాండ్‌ ఘన విజయం

నవతెలంగాణ – హైదరాబాద్: పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన PNG 78 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు టీ20 వరల్డ్ కప్-2024 నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో గ్రూప్-సీలో న్యూజిలాండ్ మూడో స్థానంతో తన ప్రస్థానాన్ని ముగించింది.

Spread the love