అక్రమ లేఅవుట్ల పట్ల జిపి కార్యదర్శి నోటీసులు.. యజమాన్యాల చర్యలు శూన్యం

నవతెలంగాణ- మద్నూర్:

 మద్నూర్ మండల పరిధిలోని మద్నూర్, హెచ్ కె లూరు, గ్రామ పంచాయతీల పరిధిలో అక్రమ లే అవుట్ల దందాలు జోరుగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా లేఅవుట్ల ఏర్పాట్ల పట్ల జిపి కార్యదర్శిల నోటీసులకు అక్రమ లేఔట్ల యజమాన్యాలు బెకాతరు చేయడం. పుట్టగొడుగుల్లోగా పుట్టుక వస్తున్న అక్రమ లేఔట్ ల గురించి జిపి కార్యదర్శులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ అక్రమ లేఔట్ల పట్ల ఉన్నతాధికారుల చర్యలు శూన్యం అయ్యాయి. గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా హద్దులు వేసి లక్షల రూపాయలకు ఒక ప్లాట్ చొప్పున అమ్మకాలు జరుగుతుంటే ఇలాంటి అక్రమ లేఔట్ ల గురించి సంబంధిత శాఖల అధికారులు నిద్ర అవస్థ లో పనిచేయడం పై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీల పరిమిషన్లు లేకుండా అక్రమ లేఔట్లు వేస్తూ జోరుగా దందాలు కొనసాగిస్తుంటే పంచాయతీల అధికారుల నోటీసులు పనిచేయడం లేదు అక్రమ లేఅవుట్ల గురించి సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి నివేదికలు వెళ్లిన మండల అధికారులు డివిజనల్ అధికారులు జిల్లా అధికారులు కన్నెత్తి చూడకపోవడం అక్రమ లేఅవుట్ల యజమాల్యాల ద్వారా సంబంధిత శాఖల అధికారులకు ముడుపులు అందుతున్నాయని ఆరోపణలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. పంచాయతీల పరిధిలో అక్రమ లేఔట్ ల గురించి మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్యకు నవ తెలంగాణ ఫోన్ ద్వారా వివరణ కోరగా తమ దృష్టికి వచ్చిన మాట నిజమేనని అక్రమ లేఔట్ లపై చర్యలు తీసుకుంటామని కావాలనుకుంటే పాతిన హద్దులు తొలగిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.
Spread the love