కడియం గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి: ఎన్నారై చాడ సుజన్ రెడ్డి

నవతెలంగాణ-ధర్మసాగర్
కడియం గెలిపి లక్ష్యంగా ముందుకు సాగాలని ఎన్నారై చాడ సూజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుండి మండలంలోని అన్ని ప్రధాన రహదారుల వెంట దాదాపు 500 బైక్ ర్యాలీని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ కడియం శ్రీహరి గెరిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పనులను, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి చేరవేయాలి 35 సంవత్సరాల రాజకీయ అనుభవం గల నాయకులు కడియం శ్రీహరిని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరుదని అన్నారు. రాజకీయ అనుభవం లేని కాంగ్రెస్ నాయకులను గెలిపించడం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేమని అన్నారు. రైతులకు 24 గంటలూ కరెంటు, రైతు బీమా, సకాలంలో ఎరువులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు.రైతులకు 24 గంటలూ కరెంటు, రైతు బీమా, కాలంలో ఎరువులు, మందులు అందుతున్నాయన్నారు.కాంగ్రెస్‌ మాయమాటలకు మోసపోయి ఓటు వేస్తే తెలంగాణకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని,ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మి ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని సాధించాలంటే కడియం శ్రీహరి కారు గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీని అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, ఉప సర్పంచ్ బొడ్డు అరుణ రవీందర్, ఎంపీటీసీలు ఆర్. రాజు యాదవ్, బొడ్డు శోభ సోమయ్య, కొలిపాక వనమాల సారయ్య, నాయకులు చాడ వెంకట్ రెడ్డి, బొడ్డు కుమార్, బొడ్డు ప్రభుదాస్, చాడ కుమార్, కొలిపాక రమేష్, బొడ్డు సురేష్, బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love