నవ తెలంగాణ- ఆర్మూర్ : పట్టణంలోని పిస్స మల్లన్న అలయం వద్ద బుధవారం టేక్నోసాఫ్ట్ కంప్యూటర్స్ సంస్థ అధ్వర్యంలో బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని టెక్నో సాప్ట్ సంస్థ చైర్మన్ జితేందర్ రెడ్డి అన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీ జీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేధన్ గుజరాతి మాట్లాడుతూ ఆశ్వయుజ మాస శుధ్ధ పౌడ్యమి నుండి తొమ్మిది రోజుల ముందు బతుకమ్మ పండగను (సద్దుల పండుగ ) ను యావత్తు తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఎంతో ఉత్సహంగా, ఆనందంగా, అంగరంగా వైనవంగా బతుకమ్మని త్రికొనంగా పువ్వులతో పేర్చి అలంకరించి పూజలు నిర్వహించి చప్పట్లు చరుస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ వలయాకారంగా తిరుగుతూ నృత్యాలు చేస్తూ ఘనంగా జరుపుకుంటారని కొనియాడుతూ యావత్తు తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండగ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన లయన్ నివెదన్ గుజరాతి ఇట్టి కార్యక్రమంలో కంప్యూటర్ ఫాకల్టీ ఈశ్వరి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.