మండలంలోని తపాలాపూర్ గ్రామంలో ఉన్న ఆదివాసీ గిరిజనులకు శనివారం గిరిజన సంక్షేమ శాఖ మంచిర్యాల్ ఆధ్వర్యంలో తపాలపూర్ గ్రామంలోని కోలం ఆదివాసి గిరిజనులకు ప్రధానమంత్రి జాతీయ ఆదివాసి న్యాయమహా అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ ఆధార్ కార్డు అప్లై చేయడం పీఎం జన్ ధన్ అకౌంట్ తీయడం, వైద్య ఆరోగ్యశాఖచే పోషకాహార లోపం ,రక్తహీనత పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏటీడీవో ఏ .పురుషోత్తం, ఎమ్మెల్ హెచ్పి సందీప్, కొల్లూరి కమలాకర్ ఆరోగ్య కార్యకర్త, రమేష్ పంచాయతీ కార్యదర్శి, విజయ, లలిత ఆశలు గ్రామ గిరిజనులు పాల్గొన్నారు.