Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంటీజీపీఎస్సీ స్థానికత విధానంపై ఆక్షేపణ

టీజీపీఎస్సీ స్థానికత విధానంపై ఆక్షేపణ

- Advertisement -

2022 ఏఈఈ నియామకాల
వ్యవహారంలో హైకోర్టు అభ్యంతరం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉద్యోగ నియామకాల్లో స్థానికత నిర్ధారణ విషయంలో టీజీపీఎస్సీ అనుస రిస్తున్న భిన్న ప్రమాణాలను హైకోర్టు సోమవారం తప్పుబట్టింది. ఒకే అంశంలో వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కారణాలతో స్థానికతను నిరాకరించడం చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. రాష్ట్రప తి ఉత్తర్వుల నిబంధనలను సమ గ్రంగా అమలు చేయాలనీ, స్థానికత నిర్ణయంలో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలని ఆదేశించింది. 2022 ఏఈఈనియామకాల వ్యవహారంలో అభ్యర్థి పి నిశాంత్‌ను స్థానికుడిగా గుర్తించాలని ఇచ్చిన సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థిస్తూ టీజీపీఎస్సీ అప్పీల్‌ను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది.

ఐడీపీఎల్‌ భూముల వివాదంలో రాష్ట్రానికి నోటీసులు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్‌కు కేటాయించిన 891.38 ఎకరాల భూముల స్వాధీన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. భూముల స్వాధీనానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వచ్చేనెల 13కు వాయిదా వేసింది. భూమిపై పూర్తి హక్కులు తమకేనని ఐడీపీఎల్‌ వాదించగా, పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని ఇతరులకు లీజుకు ఇవ్వడంతో స్వాధీన చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.

రోడ్డు స్థలాలకు క్రమబద్ధీకరణ వర్తించదు
లేఔట్లలో రోడ్లు, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలకు క్రమబద్ధీకరణ పథకాలు వర్తించవని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. రోడ్డు కోసం నిర్ధేశించిన స్థలాన్ని ఎల్ఆర్ఎస్‌ లేదా ఇతర రెగ్యులరైజేషన్‌ పథకాల కింద క్రమబద్ధీకరించలేమని పేర్కొంది. అలాగే రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఏకపక్షంగా రద్దు చేయడం చెల్లదనీ, సంబంధిత పక్షాలకు నోటీసులు ఇచ్చి చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని తెలిపింది. గుట్టలబేగంపేటలోని ఓ స్థల వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, ఎల్ఆర్ఎస్‌ దరఖాస్తు తిరస్కరణను సమర్థిస్తూ ఈ మేరకు తీర్పు వెలువరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -