అభివృద్ధి చేశా.. మరోసారి అవకాశం కల్పించండి..

– ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ-డిచ్ పల్లి : గత ప్రభుత్వాల హాయంలో గ్రామాల్లో అభివృద్ధి కొంటూ పడిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామానికి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామని మరోసారి అవకాశం కల్పించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.సోమవారం 12గంటల తర్వాత మండలంలోని బర్దిపూర్ గ్రామంలో పలు  అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఉండడంతో ఎన్నికల కోడ్ రావడంతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయకుండానే ప్రచారాన్ని ర్యాలీతో ప్రారంభించి గ్రామంలోని చర్చి ఆదాయంలో ప్రార్థన చేసిన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో పాలించిన పాలకులు గ్రామాలకు ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా కళ్ళబోల్లి మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అలాంటి వారి మాటలను నమ్మవద్దని సూచించారు గతంతో నేడు పోల్చుకుని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అహర్నిషలు కృషి చేశానని మరొకసారి అవకాశం కల్పిస్తే మిగిలిపోయి ఉన్నా కొద్దిపాటి పనులు పూర్తి చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు హామీలు ఇచ్చారు.కోడ్ రావడంతో అభివృద్ధి పనులు ప్రారంభించలేకపోయానని వివరించారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీ నర్సయ్య, మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు శక్కరి కోండ కృష్ణ, సర్పంచ్ నీరడి సుజనా, నీరడి పద్మారావు, సర్పంచులు, ఎంపిటిసిలు, ఉగ్గెర కృష్ణ వేణి, పత్తి అనంద్, మోహమ్మద్ యూసుఫ్, డాక్టర్ శాదుల్లా, తో పాటు నాయకులు కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love