స్వచ్ఛత వైపు ఒక్క అడుగు..

నవతెలంగాణ – రాంనగర్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటి కమిషనర్‌, అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆదేశానుసారం “స్వచ్ఛత వైపు ఒక్క అడుగు” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిశుభ్రత ముద్దు – చెత్తవద్దు, చెత్త ఉంటే రోగం – లేకుంటే ఆరోగ్యం , చెత్తని రోడ్లపై వేయకండి – స్వచ్ఛ ఆటో లో వేయండి అనే స్లొగన్స్ తో ghmc సానిటరీ వర్కర్స్ ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్ , అడిక్మెట్ , విద్యనగర్ లో ప్రజలకు అవర్నెస్ కల్పించే విధంగా ర్యాలీ జరిపారు. హైదరాబాద్ పలు చోట్ల gvp (Garbage Vulnerable Points) పాయింట్స్ వున్నాయి.నివాసం ఉంటున్న ప్రజలు చెత్తని తీసుకువచ్చి రోడ్డు పక్కనే వున్న ఈ పాయింట్స్ లలో వేస్తున్నారు. దీని వలన హాని కరమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెత్త రహిత మహానగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టారు . ప్రజలు వారి వీధుల్లోకి ఇండ్ల దగ్గరకు వస్తున్న స్వచ్ఛ ఆటోలకు చెత్తని ఇవ్వాల్సిందిగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు . ఈ ర్యాలీలో 50 మంది వర్కర్లు , శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు (SFA ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (phc ) సిబ్బంది , శానిటరీ సూపర్ వైజర్ వి.గోవర్ధన్ (SS) పాల్గొన్నారు.

Spread the love