రాజకీయంగా ఎదుర్కోలేకనే అభివృద్ధి‌ ప్రదాత డాక్టర్‌ గాదరి కిషోర్‌ కుమార్‌పై ప్రతిపక్షాల ఆరోపణలు

– ఎంపీపీ కవిత రాములు గౌడ్‌
నవతెలంగాణ -తుంగతుర్తి
తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ గాదరి కిషోర్‌ కుమార్‌ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన యువకిశోరం గాదరి కిషోర్‌ పై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని అన్నారు. బీడు భూములతో ఎడారిగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చిన ఘనత కిషోర్‌ కుమార్‌ దే అన్నారు. నియోజకవర్గ అభివద్ధి కోసం నిరంతరం కషి చేసే ఎమ్మెల్యే దొరకడం నియోజకవర్గ ప్రజల అదష్టమన్నారు. ప్రతిపక్షాలు ఎవరెన్ని వేషాలు వేసిన యాట్రిక్‌ దిశగా మూడోసారి అధిక మెజార్టీతో కిషోర్‌ అన్న గెలవడం తధ్యమన్నారు.

Spread the love