ప్రజలను రక్త దానం వైపు చైతన్య పరచటమే మా లక్ష్యం..

– యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త దాన అవగాహన ర్యాలీ..
– ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొడిశెల రాజశేఖర్..
నవతెలంగాణ – వేములవాడ 
ప్రపంచ రక్త దాతల దినోత్సవం జూన్-14 సందర్బంగా వేములవాడ పట్టణం లో అవగాహన ర్యాలీ.. ప్రజలను రక్త దానం వైపు చైతన్య పరచటమే మా లక్ష్యం యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కానిస్టేబుల్ గొడిశెల రాజశేఖర్ గౌడ్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణం లోని మొదటి బైపాస్ రోడ్డు లో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త దాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రమణా రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. రక్త దానానికి దాతలు ఉత్సహం గా నిర్భయంగా ఎలాంటి అపోహలు లేకుండా స్వచ్చందంగా ముందుకు రావాలి అని అన్నారు.రక్త దానం పై అవగాహన కలిగి వుండి రక్త దానం చేయాలి అని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండి ఆరోగ్యం గా వున్న స్త్రీ పురుషులు ప్రతీ మూడు నెలల కు ఒక్కసారి రక్త దానం చేయొచ్చు అని, ఎలాంటి అపోహలు వున్నా డాక్టర్ ని సంప్రదించి రక్త దానం చేయాలి అని తెలిపారు. రక్త దానం వల్ల అనేక రకాల వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు అని రక్త దానం వల్ల ఆరోగ్యం గా ఉండవచ్చు అని రక్తానికి రక్తమే  ప్రత్యామ్నాయం అని కాబట్టి ముఖ్యం గా యువత రక్త దానానికి ముందుకు వచ్చి ఆపద సమయం లో వున్నవారికి రక్త దానం చేసి ప్రాణ దాతలు గా నిలవాలి అని యువత ను కోరారు. అనంతరం  ప్రజలకు రక్త దానం మీద అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో  మార్నింగ్ క్రికెట్ క్లబ్ సభ్యులు,యువ ఫౌండేషన్ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
Spread the love