రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ ఇద్దరినీ గద్దె దింపడమే మా లక్ష్యం: ఎన్ఎస్ యుఐ

నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ ఇద్దరినీ గద్దె దింపడమే మా లక్ష్యంమని ఎన్ ఎస్ యు ఐ నాయకులు అన్నారు. సోమవారం  తెలంగాణ యూనివర్సిటీ లోని న్యూ బాయ్స్ హాస్టల్లో  నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు కొమిర శ్రీశైలం మాట్లాడుతూ రాష్ట్రంలో గత పదేళ్ల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను, విద్యార్థులకు నిరుద్యోగులకు చేసిన అన్యాయాలను వివరించారు. ఉద్యమ సమయంలో మాయమాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు విద్యార్థి సంఘ నాయకులని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా కేసీఆర్ మాయమాటలు చెప్పి 1200 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారకుడైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆశయాలకు వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తూ గత పదేళ్ల నుండి ఏ ఆకాంక్షలతోనైతే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇవ్వడం జరిగిందని, దానికి విరుద్ధంగా బిఆర్ఎస్ తన పాలనను సాగిస్తుందని విమర్శించారు. ఉద్యమ సమయంలో  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు నిధులు నియామకాలు మనకు వస్తాయని ప్రజలను ఉద్యమం వైపు తిప్పుకొని స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలను పక్కనపెట్టి, విద్యార్థులను అణచివేసి, విద్యార్థి నిరుద్యోగులను ఉపాధికి దూరం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ రాష్ట్రంలో వరుస పేపర్ లీకులతో 40 లక్షల యువతను ఉపాధికి దూరం చేశారని, తొమ్మిదేళ్ళ లో ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విషయానికొస్తే బిజెపి హామీలు అమలు చేయడంలో విఫలమైందని, 2014లో బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామంటూ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మరిచిపోయి, మేకిన్ ఇండియా అంటూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీ కారణ చేయడం జరిగిందని వాపోయారు. రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి పరీక్షలో పరీక్ష పేపర్లను లీక్ చేయడం, జిల్లా కేంద్రాల్లో చూసుకుంటే  ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ వ్యక్తులకు లీజులకు ఇవ్వడం తప్ప ఒరిగ బెట్టింది ఎమీ లేదన్నారు. ఒకటేమో రాష్ట్రాన్ని అమ్మే ప్రయత్నం, మరొకరు ఏమో దేశాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సింది లీకుల ప్రభుత్వం, లీజుల ప్రభుత్వం కాదని, ప్రజా ప్రభుత్వం కావాలని అది రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీకి యూత్ డిక్లరేషన్ అనేది విద్యార్థుల పక్షాన నిలబడ్డ ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెనువెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, దానితోపాటు ఉన్నత విద్య చదువుకోవడానికి 5 లక్షలవిద్యా భరోసా కార్డు, నిరుద్యోగ భృతి 4000, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్, 18 ఎళ్ళ పైబడిన ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని, ఇదే కాకుండా మరీ ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకు 25500 ఆర్థిక సహాయాన్ని ప్రతినెల అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.సమవేశంలో యూనివర్సిటీ ఎన్ ఎస్ యు ఐ నాయకులు రాజేందర్, నవీన్, పరమేష్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love