మా ఏకైక లక్ష్యం రెగ్యులరైజ్ టు సర్వీస్…

– యూనివర్సిటీ లో అధ్యాపకుల నిరసన..
నవతెలంగాణ-డిచ్ పల్లి
మా ఏకైక లక్ష్యం రెగ్యులరైజ్ టు సర్వీస్ అనే డిమాండ్ తో అనునిత్యం తెలంగాణ యూనివర్సిటీ లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న మని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మినమేషలు లేక్కిస్తుందని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి అన్నారు. శుక్రవారం  యూనివర్సిటీ లోని బిజినెస్ మేనేజ్మెంట్ కామర్స్ అండ్ బిల్డింగ్ లో కాంట్రాక్ట్ అధ్యాపకుల సమావేశం నిర్వహించిన అనంతరం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ బి దత్త హరి పాల్గోని మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరూ రెగ్యులరైజ్ కోసం వివిధ రూపంలో రాజకీయ నాయకులని కలుస్తు ఉండాలని, మేము కూడా రాజకీయ లాభం చేస్తే బాగుంటుందనే విషయం పై పాలు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పోరాటంతో పాటు, రాజకీయ లాబీయింగ్ ద్వారానే కాంటాక్ట్ లెక్చర్లను రెగ్యులరైజ్ కావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని, అధికార పార్టీ నాయకులను కలవటం మా సమస్యను విన్నవించుకోవడం ఆ సమస్యని పరిష్కారం కోసం ప్రయత్నం చేయటం, సమావేశ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతిరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నమని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్నమన్నారు.ఈ కార్యక్రమం లో కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు.
Spread the love