ముగిసిన ఏ టి ఏ ఎల్ సమ్మర్ బూట్ క్యాంప్

నవతెలంగాణ-భిక్కనూర్ : మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో యు ఎన్ ఐ సి ఈ ఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుండి 26 వరకు నిర్వహించిన ఏ టి ఏ ఎల్ సమ్మర్ బూట్ క్యాంప్ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సైన్స్ అధికారి సిద్ధరామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల నూతన ఆవిష్కరణ, జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాలని, విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని సూచించారు. ఈ శిక్షణా శిబిరంలో పెద్ద మల్లారెడ్డి గర్గుల్ ఉప్పల్వాయి కొండాపూర్ విద్యార్థులు పాల్గొని కొత్త కొత్త ఆవిష్కరణ సంబంధించిన ప్రాజెక్టును తయారు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలగంగాధర్, వాసు, రమేష్, పురుషోత్తం, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love