వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ను ముట్టడిస్తాం..

– ప్రభుత్వ ఆదేశాలను బేఖాతలు చేస్తున్న అవినీతి వీసీ పై చర్యలు తీసుకోవాలి..
– యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు
నవతెలంగాణ డిచ్ పల్లి
ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అవినీతి వైస్ ఛాన్సలర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ను ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. శుక్రవారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో విసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయనది క్యాబినెట్ హోదా అని, ఆఫ్ట్రాల్  ఈసీ సభ్యులు సమావేశం కు పిలిస్తే నేనెందుకు వెళ్లాలని ఆయన విద్యార్థులతో బహిరంగంగా అంటున్నారని, రూరల్ ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఈసీ, ప్రభుత్వ అనుమతి లేకుండా డైలీ వేజెస్  పేరుతో లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగులను నియమించి, పరికరాల కొనుగోలు పేరుతో కోట్ల రూపాయల నిధులు అంతా దుర్వినియోగం చేస్తూ, యూనివర్సిటీ ఖజానా మొత్తం ఖాళీ చేశారని, ఏవో, ఇంకా మిగతావారు లక్షల రూపాయలు అడ్వాన్సులు తీసుకొని ఇప్పటివరకు ఇంకా ఖర్చుల వివరాలు తెలియజేయలేదని, ఈసీ సభ్యులు ఒక రిజిస్ట్రార్ ను నియమిస్తే వీసీ  ఒక రిజిస్ట్రార్ నియమిస్తున్నారని,  ఇద్దరు రిజిస్ట్రార్ లు ఎలా ఉంటారని ప్రశ్నించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ లేక హాస్టల్లో కాలేజీల్లో ఎలాంటి రిపేరింగ్ పనులు జరగడంలేదని, విద్యార్థులకు  మెమోలు ఇవ్వలేని పరిస్థితిలో యూనివర్సిటీ  ఉందని, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే నా ఇష్టం వచ్చిన వారిని రిజిస్ట్రార్ గా నియమిస్తానని మీకు అవన్నీ అవసరం లేదని పోలీసులను పిలిపించి అరెస్టు చేయిస్తానని  బెదిరింపులకు గురి చేస్తున్నారని వారన్నారు.
ఈసీ సమావేశంకు  వెళ్లి ఈసీ సభ్యుల ఆమోదంతో రిజిస్ట్రార్ను నియమించాలని డిమాండ్ చేశారు.  వీసీ పై ఇంత అవినీతి ఆరోపణలు వస్తున్న, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కాల్వ కుంట్ల కవిత , మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించి విసీ పై చర్యలు తీసుకోవాలని, తెలంగాణ యూనివర్సిటీని కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, వీసీ ఛాంబర్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు సంతోష్, లక్ష్మీనారాయణ, సాయి కృష్ణ, సైమన్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love