దళితుల ఆత్మగౌరవం పెంచిన కేసీఆర్ కె మా మద్దతు

– నెమలి బాలకృష్ణ తెలంగాణ దలిత ఐక్యత సమితి వ్యవస్థాపక అధ్యక్షులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట : దళితుల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తూ ఆత్మ గౌరవం పెంచిన కేసిఆర్ కే తెలంగాణ దళిత ఐక్యత సమితి సంఘం మద్దతు. బడే నాగజ్యోతిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని తెలంగాణ దళిత ఐక్యత సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నెమలి బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దళిత ఐక్యత సమితి సమావేశంలో మాట్లాడారు. 60 ఎండ్ల్ల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దళితులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు ప్రకటించిన దళిత సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దళితులను కూలీలను చేస్తే తెలంగాణ ఎరుపాటు తరువాత తెలంగాణ రాష్ట్ర సాధకులు, రథ సారథి ముఖ్య మంత్రి కేసిఆర్ గారు పదునైన ఆలోచనలో పుట్టిన దళిత బందు పథకం ద్వారా10 లక్షల రూపాయలు ఈస్తు  యజమానులను చేశాడు అన్నారు. దళితుల జీవితాలలో వెలుగులు మొదలైనవి అని తెలిపారు. ఇప్పటికే దళిత బందు వెలుగులు దళితులలో మనం స్వయంగా చూస్తున్నాం. ఇప్పుడు వరకు గత పాలకులు దళితులను పట్టించుకున్న జాడ లేదు అన్నారు. దళిత బందుతో పాటు దళిత వాడలలో రోడ్లు, కరెంట్, నీళ్ళు సదుపాయాలు కల్పించిన ఘనత కెసీఆర్ దే.అంతే కాకుండా సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి 120 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి దళితలకు ఆత్మ గౌరవాన్ని పెంచిది కేసిఆర్ నే అని అన్నారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసిఆర్  కావాలంటే బడే నాగాజ్యోతిని దళితుల అంత ఒక్కటై కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. దళిత బందు నిరంతరయంగా జరిగే పక్రియ అన్నారు. రాబోయే 5 ఎండల్లో ములుగు నియోజకవర్గంలో  ములుగు కాబోయే ఏంల్ఏ బడే నాగ జ్యోతి అధ్వర్యంలో ప్రతి తెల్ల రేషన్ కార్డ్ ఉన్న దళిత కుటుంబాలకు దశల వారీగా దళిత బందు అందుతుందన్నరు. దళితుల ఆత్మ గౌరవం పెంచుతూ, అసెన్డ్ భూములకు పట్టాలు భూమి పైన సర్వ హక్కులు కల్పిస్తూ దళిత బందు  ఇస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే తెలంగాణ దళిత ఐక్యత సమితి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈయొక్క కార్యక్రమంలో  దుడపక రాజేందర్, వేల్పుల శ్రీకాంత్, దర్షణాల సంజీవ, మంథని రాజేందర్, అమరారపు గాంధీ, వేల్పుల బాబు, పసుల భద్రయ్య, చుంచు యాకోబు, దళిత నాయకులు పాల్గొన్నారు.
Spread the love