Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణికి బకాయిలు వెంటనే చెల్లించాలి

సింగరేణికి బకాయిలు వెంటనే చెల్లించాలి

- Advertisement -

‘జెన్‌కో, ట్రాన్స్‌కో’లు
రూ.46 వేల కోట్లు పెండింగ్‌
విద్యుత్‌సౌధ వద్ద కార్మికుల ధర్నా

నవతెలంగాణ-సిటీబ్యూరో
సింగరేణి సంస్థకు జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు పెండింగ్‌ లో ఉన్న రూ.46 వేల కోట్లు చెల్లించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన (సీఐటీ యూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ లోని విద్యుత్‌ సౌధ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సింగరేణి ప్రాంతంలోని రామగుండం, శ్రీరాంపూర్‌, మంద మర్రి, కొత్తగూడెం, మణుగూరు తదితర బ్రాంచ్‌ నుంచి కార్మి కులు తీవ్రమైన ఎండను సైతం లెక్క చేయకుండా సంస్థ పరి రక్షణ కోసం పెద్దఎత్తున తరలివచ్చారు. ధర్నాకు యూనియన్‌ గౌరవాధ్యక్షులు భూపాల్‌ అధ్యక్షత వహించగా.. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడారు. సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలను విద్యుత్‌ సంస్థల ద్వారా ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తం గా ఉద్యమిస్తామన్నారు. సింగరేణి కార్మికుల పోరాటానికి మద్దతిచ్చారు.

సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి దివాళా తీసే పరిస్థితి ఏర్పడింద న్నారు. సంస్థకు చెల్లించాల్సిన రూ.46 వేల కోట్లు ఇవ్వకపోవ డంతో ఉద్యోగుల వేతనాలకు కొరత ఏర్పడిందన్నారు. సంక్షేమ పథకాలు, స్పేర్‌ పార్ట్స్‌, రక్షణ పరికరాలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణం బకాయిలు చెల్లించకపోతే అన్ని సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొంది లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి సంస్థను ఆర్థికంగా నిర్వీర్యం చేసి ప్రయివేటు వారికి అప్పగించడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతు న్నదన్నారు. సింగరేణి కరెంట్‌ను యూనిట్‌కు రూ.5.15కి కొని డబ్బులు చెల్లించడం లేదన్నారు.

బొగ్గు సరఫరాకు డబ్బులు చెల్లించక దివాళా తీయిస్తోందన్నారు. గౌరవాధ్యక్షులు భూపాల్‌ మాట్లాడుతూ.. సింగరేణి డబ్బులను భట్టి విక్రమార్య మధిర అభివృద్ధికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ అభివృద్ధికి, ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గాలకు, ఇతర సంక్షేమ పథకాలకు వాడుతున్నారని, కార్మికుల సంక్షేమం పట్టించుకో వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టీఎస్‌ జెన్‌ కో చైర్మెన్‌ అండ్‌ ఎండీ ఎస్‌.హరీశ్‌ను యూనియన్‌ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారు. సింగరేణికి జెన్‌కో రూ.19వేల కోట్ల బకాయిలు ఉన్నది వాస్తవమని, ప్రతినెలా రూ.200 కోట్లు చెల్లించే విధంగా చర్చిస్తున్నామని చెప్పారు. త్వరలో మంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చైర్మెన్‌ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న, యూనియన్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ ఇల్లి రాజేందర్‌, వెంకట్‌ స్వామి, బాలాజీ, కొమరయ్య, ప్రసాద్‌, సారయ్య, మెండె శ్రీనివాస్‌, సాయిరెడ్డి, వై.వెంకటేశ్వరరావు, సాయి కృష్ణ, వెంకటరత్నం, లక్ష్మణరావు, ఇ.కుమార్‌, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -