మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్గా గ్రామ ప్రజలకు తాగునీటి ఎద్దడి 50 ఏళ్ల కాలంగా పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆ గ్రామా సర్పంచ్ గాయక్వాడ్ ప్రకాష్ నీటి ఎద్దడి పై ఆవేదన వ్యక్తం చేశారు. తడి ఇప్పర్గా గ్రామ ప్రజలు తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రతి ఐదేళ్లకొకసారి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు త్రాగునీటి సమస్య తీరుస్తామంటూ హామీలు గుర్తించడం ఎన్నికల తర్వాత ఐదు సంవత్సరాల పాటు ప్రజా సమస్యలపై పట్టించుకోకపోవడం గత 50 సంవత్సరాల కాలంగా మా గ్రామ ప్రజలకు త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా కొనసాగుతుందని గ్రామ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి మళ్లీ ఓట్ల కోసం ఆయా పార్టీల నాయకులు గ్రామానికి రాబోతున్నారు. మా గ్రామ ప్రజల తీవ్ర నీటి ఎద్దడి సమస్య మళ్లీ ఎన్నికల్లో పరిష్కరిస్తామంటూ హామీల కోసమే రావడం కాదు ముందుగా నీటి సమస్య తీర్చాలని గ్రామ సర్పంచ్ గా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పచస్ సాల్సే పీనేక పానిక ప్రాబ్లం పరిష్కార్ నహిహోరా బోల్కే సర్పంచినే ఆవేదన వ్యక్త కియా.