నవతెలంగాణ-మోతె
సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు పజ్జూరి సత్తెమ్మ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు.బుధవారం మండలపరిధిలోని రాఘవాపురం గ్రామంలో సత్తెమ్మ సంతాప సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.సత్తెమ్మ భర్త భద్రయ్య పార్టీ మండల కమిటీ సభ్యునిగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకునిగా పనిచేసే అనేక గ్రామాల్లో భూమి కూలి ఉద్యమాలను నిర్వహించారన్నారు.భద్రయ్య ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ సత్తెమ్మ పార్టీ సభ్యురాలుగా ఉంటూ పార్టీ, ప్రజాసంఘాలలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తుందన్నారు. ఆమె మరణం సీపీఐ(ఎం) పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య, డీివైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు వెలుగుమధు చేగువేరా, పార్టీ సానుభూతిపరులు బుర్రాజు లింగయ్య, మట్టిపల్లి గంగయ్య, ఉపసర్పంచ్ పజ్జూరిరేణకశ్రీశైలం, పార్టీ గ్రామ కార్యదర్శి బూడిద లింగయ్య తదితరులు పాల్గొన్నారు.