ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం

– వీఆర్ఏ కుటుంబాల్లో వెలుగు నింపిన కేసీఆర్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
వీఆర్ఏ లకు ఉద్యోగ క్రమబద్ధీకరణ కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటాలకు నసురుల్లాబాద్ మండల వీఆర్ఏలు పాలభిషేకం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట పాలాభిషేం అనంతరం వీఆర్ఏల మండల అధ్యక్షులు నీరడి పెంటయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలీచాలని జీతాలతో 3వందల రూపాయల జీతం నుండి ఐదు వేల లోపు జీతం వరకే అందుకున్నామని, అదే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏ లందరికీ కనీస వేతనం 11, ఐదు వందల కు పెంచారని గుర్తు చేశారు. దేశంలో పెరుగుతున్న నిత్యవసర ధరలు, కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని. కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేసీఆర్ ఈ విధానానికి కట్టుబడి ఉండి, వీఆర్వో వ్యవస్థ రద్దు చేసే సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏ కుటుంబాలను కూడా ఆదుకుంటాం వీఆర్ఏలందరికీ పేస్కేలు ఇస్తామని ప్రకటించదాంతో వి అర్ ఏ ల్లో ఆశలు చిగురించాయి. కొన్ని రోజులు ఆలస్యమైన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి క్యాబినెట్ సమావేశంలో వీఆర్ఏ లందరికీ క్రమబద్దకరణ ఆమోదించడం చాలా సంతోషమన్నారు, దీనితో వీఆర్ఏల కుటుంబాలలో కేసీఆర్ సంతోషం , వెలుగులు నింపారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కి అదేవిధంగా ఈ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పంతంగి పిరయ్య, కోశాధికారి శాదుల్ల, సీనియర్ నాయకుడు బండారి బాబయ్య, బంగారు మైసయ్య, సాయిలు, సుదర్శన్, శ్రీనివాస్, దత్తు, కృష్ణ, మోహన్, కిరణ్ తో పాటు మండల వీఆర్ఏలు పాల్గొన్నారు.

Spread the love