ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలాభిషేకము

నవతెలంగాణ – కంటేశ్వర్
జిల్లా బీసీ హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమైన నిర్ణయం అని బీసీ హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తూ, బీసీ కులాల లెక్కలకు చట్టబద్ధత భరోసా కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి బీసీ కుల గణన చేపట్టడం బీసీ సబ్ ప్లాన్ పైన కూడా అసెంబ్లీలో చర్చించడం బీసీలకు పెద్ద ఎత్తున నిధులు సమీకరించడం, వారి అభ్యున్నతికి పాటుపడటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేపట్టడం హర్షదాయకం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారికి బీసీ హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాయ వార్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. ఈ  కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అశోక్, కార్యదర్శి రమేష్, కార్యవర్గ సభ్యులు ఎన్ సత్యనారాయణ, సుదర్శన్, పురుషోత్తం, దాస్, మహేందర్ గౌడ్, లక్ష్మణ్, రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love