హైదరాబాద్ : నాగోల్ కుంట్లూరులోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ (పిఇసి)కి న్యాక్ గుర్తింపు లభించిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం నవీన్ కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్ జె గోవర్థన్, ప్రిన్సిపల్ ఎంబి రాజు, డైరెక్టర్ (ప్లేస్‌మెంట్స్) సుమేధా రమేష్ కెతో కలిసి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. పిఇసి ఐదేళ్ల కాలానికి గాను న్యాక్ ‘ఎ’ గ్రేడ్ పొందినట్లు పేర్కొంది. గత 30 ఏళ్లుగా పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్‌ట్యూషన్స్ విద్యా రంగంలో నిరంతర సేవలంది స్తోందన్నారు. తమ గ్రూప్ కింద ఐదు ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లు, 13 పల్లవి ఇంటర్నేషనల్, మోడల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. అదే విధంగా డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలను నిర్వహిస్తోందన్నారు. పిఇసిలో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ సైన్స్, సిఎస్‌ఇ, ఎంబిఎ కోర్సులను అందిస్తున్నామన్నారు. సగటు ఉత్తీర్ణత 75 శాతంగా ఉందన్నారు. ప్రస్తుత సంవత్సరంలో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఏడాదికి 30 లక్షల వరకు వేతనం పొందిన వారు ఉన్నారన్నారు. తమ యాజమాన్యం సమీప భవి ష్యత్తులో ప్రయివేటు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని యోచిస్తోందన్నారు.