8 బిల్లులతో కేంద్రం రెడీ
నీట్, అయోధ్య అంశాలపై
పోరుకు విపక్షాలు సై
నవతెలంగాణ-న్యూఢిల్లీ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం 8 బిల్లులను సిద్ధం చేసింది. ముఖ్యంగా సోమవారమే పార్లమెంట్ ముందుకు రెండు కీలక బిల్లులు రానున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37 కు పెంచుతూ రూపొందించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.
వందేమాతరం గేయానికి జాతీయగీతం హోదా కల్పిస్తూ రూపొందించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరింది. మరోవైపు అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం, నీట్ పేపర్ లీకేజీ సహా పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు ప్రకటించాయి. ఈ మేరకు కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో తమ వైఖరిని స్పష్టం చేశాయి. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
- Advertisement -
- Advertisement -



