Monday, July 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనీట్ పేప‌ర్ లీక్‌పై చర్చ జ‌ర‌గాలి

నీట్ పేప‌ర్ లీక్‌పై చర్చ జ‌ర‌గాలి

- Advertisement -

ఆ బిల్లులను ప్రతిపక్షాలతో 
చర్చించాకే ప్రవేశపెట్టాలి : సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్
సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ “ఇంతటి ముఖ్యమైన, వివాదాస్పద బిల్లులను పార్లమెంటుకు తీసుకువచ్చే ముందు ప్రతిపక్ష పార్టీలతో అర్థవంతమైన చర్చ జరగాలని ప్రతిపక్షాలు చెప్పాయి. డీలిమిటేషన్ బిల్లు, ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’, ఎఫ్‌సీఆర్ఏ వంటి బిల్లులను ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాతే తీసుకురావాలని మేము ప్రత్యేకంగా ప్రస్తావించాము. అయోధ్య అంశం, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ జరగాలని కోరాం” అని అన్నారు. సీపీఐ రాజ్యసభ ఎంపీ పీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ” అనేక అంశాలు లేవనెత్తాం. వరుసగా ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగి, ఇరవై మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ ఈ దేశ విద్యాశాఖ మంత్రిగా ఎలా కొనసాగుతున్నారని మేము ప్రశ్నించాము. మంత్రి పదవిలో ఇంకా కొనసాగుతున్న ఆయన కచ్చితంగా రాజీనామా చేయాలి. రామమందిర విరాళాల దుర్వినియోగం లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. కాబట్టి దానిపై ప్రత్యేక చర్చ జరగాలని మేము డిమాండ్ చేశాము. ప్రభుత్వం దొంగలకు అండగా లేకపోతే, చర్చకు అనుమతించాలి” అని అన్నారు. ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్. కె. ప్రేమచంద్రన్ మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, ప్ర‌భుత్వం చ‌ర్చ‌కు ముందుకు రావాల‌ని అన్నారు. టిఎంసి ఎంపి సౌగతా రాయ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్, బెంగాల్‌లో ప్రతిపక్ష పార్టీలపై జరుగుతున్న అరాచకాలు వంటి అనేక ఇతర అంశాలను కూడా మేము లేవనెత్తామ‌ని అన్నారు. బీజేడీ ఎంపీ మానస్ మంగరాజ్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో పశ్చిమ ఆసియా సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యో ల్బణం, ఇథనాల్ వివాదం వంటి కీలక అంశాలపై చర్చకు కోరిన‌ట్లు తెలిపారు. ఒడిశా లోని పాఠ్యపుస్తకాలలోని తప్పులు, రాష్ట్రంలో రైతుల దుస్థితి, శాంతిభద్రతల పతనం, బొగ్గు రాయల్టీలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా మొదలైన అంశాలపై కూడా చ‌ర్చించాల‌ని కోరిన‌ట్ల చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -