రోడ్డు అంచున శిలాఫలకం నిర్మాణం…

– గాలికొదిలేసిన రహదారి నియమాలు
– మూన్నాళ్ళ ముచ్చటగా అభివృద్ధి ఆనవాళ్ళు
నవతెలంగాణ – అశ్వారావుపేట
శిలాఫలకం అంటేనే నేటి సామాజిక అభివృద్ధికి,మానవ పురోగతి కి ఆనవాళ్ళు గా భావితరాలకు తెలియజేసే సమాచార వారధి.ఇలాంటి ముఖ్యమైన శిలాఫలకాలపై రహదారి నియమాలకు విరుద్ధంగా నిర్మించడంతో మూన్నాళ్ళ ముచ్చటగా తయారవుతున్నాయి. మూడు రోజుల పాటు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండలంలో పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు ప్రారంభోత్సవాలు చేసారు.ఈ క్రమంలో పేరాయిగూడెం పంచాయితీ ఫైర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్క సందులో ఆర్.డబ్య్లు.ఎస్ ప్రసాద్ ఇంటి నుండి టి.వెంకట రెడ్డి గృహం వయా రైతు వేదిక వరకు రూ.13 లక్షల పంచాయితీ రాజ్ నిధుల వ్యయంతో నిర్మించిన సి.సి రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రోడ్డు అంచు నే నిర్మించారు.బుధవారం ప్రారంభం అయినప్పటికీ గురువారం నాటికి కర్టెన్ తొలగించ నే లేదు. ఇదే పంచాయితీ నెహ్రు నగర్ లోని ఉప్పు నూరి గంగయ్య ఇంటి నుండి కొవ్వాల అక్కమ ఇంటి వరకు పంచాయితీ రాజ్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు శిలాఫలకం రోడ్డు అంచు నే నిర్మించారు. పై రోడ్డుకు అనుసంధానంగా 2016 – 2017 ఆర్ధిక సంవత్సరం మద్దాల సిద్దెమ్మ ఇంటి నుండి వీ.కే.డీ.వీ.ఎస్ రాజు జూనియర్ కళాశాల వరకు రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ను నాటి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు 2018 లో ప్రారంభించారు. ఈ శిలాఫలకం సైతం రోడ్డు అంచు నే నిర్మించడంతో గుర్తు తెలియని వాహనం ఏదో ఢీ కొనడంతో శిలాఫలకం కాస్తా శిధిల ఫలకం లా కనిపిస్తుంది.గత మూడు రోజులు పాటు ప్రారంభించిన శిలా ఫలకాలు సైతం వాహనాల తాకిడికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలగించి వేరే చోట నిర్మిస్తాం – పిఆర్ ఎఇ శ్రీధర్. ఈ విషయం అయి పంచాయితీ రాజ్ ఎఇ శ్రీధర్ ను వివరణ కోరగా రోడ్డు అంచున నిర్మించిన శిలా ఫలకాలు తొలిగించి ప్రత్యామ్నాయ ప్రదేశంలో నిర్మిస్తాం అని తెలిపారు.

Spread the love