షెడ్యూల్డ్ కులాల కమ్యూనిటీ హాళ్లు..స్థానిక సంఘానికి అప్పగించాలి

– మాదిగ బందు మిత్ర సంఘం అధ్యక్షులు ఎల్లేష్..
– జాతీయ షెడ్యూల్డ్ కుల హక్కుల కమీషన్ కు వినతి. 
నవతెలంగాణ – ధూల్ పేట్ 
గోషామహల్ నియోజకవర్గం చుడీబజార్ లోని రామ్ మనోహర్ లోహియా అంబేద్కర్ కమ్యూనిటీ హాళ్ ను స్థానిక మాదిగ బందు మిత్ర సంఘానికి అప్పగించాలని ఆ సంఘం అధ్యక్షులు ఎల్లేష్ అన్నారు. స్థానిక సంఘానికి కాకుండా జీహెచ్ఎంసీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని జాతీయ షెడ్యూల్డ్ కుల హక్కుల కమీషన్ కు సంఘం అధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోకాలంగా స్థానిక షెడ్యూల్ కులాల వారికి ఫంక్షన్లు చేసుకునేందుకు వీలుగా ఉండేదే అన్నారు. ఆ భవనము శిథిలావసకు చేరడంతో జీహెచ్ఎంసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి స్థానికంగా ఉంటున్నటువంటి షెడ్యూల్ కులాలకు అనుకూలంగా ఉండేలా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. ప్రభుత్వం షెడ్యూల్ కులాలకు, గరీబులకు స్థానికంగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు సంరక్షించుచున్న ఖాలీ జాగాలలో కమ్యూనిటీ హాళ్లను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కట్టించి వాటిల్లో స్థానికంగా వుంటున్నవారి దావత్లకు, ఇతర శుభా కార్యాలకు ఉపయోగంలోకి తీసుకువస్తామన్నారు. రోడ్లను బ్లాకు చేయకుండా సౌకర్యవంతంగా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అందులో భాగంగా చుడీ బజార్ మాదిగ భంధు మిత్ర సంఘం, వందల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఖాలీ జాగాలో సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా పేరుతో కమ్యూనిటీ హాలు కట్టించి ఇవ్వాలని కోరామన్నారు. ప్రభుత్వంకు పలుమార్లు సంఘం ఆధ్వర్యంలో విన్నపించగా నాటి దివంగత హోం మినిస్టర్ నాయిని నర్సింహా రెడ్డి చొరవతో రూ.1.7 కోట్ల బడ్జెట్టు  కేటాయించి తానే శంకుస్థాపన చేశారన్నారు.  కట్టడం మొదలైన కొన్ని రోజులకు కేటయించిన బడ్జెట్టు అయి పోయిందని జిహెచ్ఎంసి అధికారులు  అర్ధాంతరంగా కట్టే పనులు ఆపేశారన్నారు.
          బడ్జెట్టు కేటాయించి ఆగిపోయిన పనులు పూర్తి చేసి ఇస్తామన్న బడ్జెట్ లేదంటూ అధికారులు వ్యవహరించారన్నారు. త్వరగా ఫంక్షన్ హాలు పూర్తి చేసి 30 వేల జనాభాగల మాదిగ భంధు మిత్ర సంఘానికి అప్పచెప్పాలని  నగర మేయర్ కు, గ్రేటర్ మున్షి పల్ కమీషనర్ ను కోరమని తెలిపారు. ఇప్పుడు పనులు మొదలు పెట్టి పూర్తైన తరువాత ప్రభుత్వమే ఎన్నికల పేరుతో వాడుకుంటామని సంబంధిత అధికారులు బుకాయిస్తూ కాంపౌండ్ వాల్ కూల్చివేశారన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కమ్యూనిటీ హాలు ప్రభుత్వం ఎన్నికల మిషన్లు పెట్టడానికి వాడుకుంటుందని చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికైనా స్పందించి కమ్యూనిటీ హాల్ బాధ్యతలను స్థానిక సంఘానికి అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు వెంకటేష్, ఆల్వాల్ శివకుమార్, రాములు, ప్రధాన కార్యదర్శి ఆర్ సుమంత్ కుమార్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love