యూనివర్సిటీ హాస్టల్స్ లను యధావిధిగా కొనసాగించాలి: పీడీఎస్ యూ

– విద్యార్థుల నుండి ఎటువంటి మెస్ చార్జీలు వసూలు చేయవద్దు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్స్ ని యదావిధిగా కొనసాగించాలని ,విద్యార్థుల నుండి ఎటువంటి మెస్ ఛార్జీలు  తీసుకోవద్దని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ యూనివర్సిటీ అధికారులను  డిమాండ్ చేశారు. గురువారం పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఇతర పరీక్షలు దగ్గర  ఉన్నాయని, దానికి సంబంధించినటువంటి పరీక్షలను ప్రిపేర్ అయ్యే సమయం తక్కువ ఉన్నందున యూనివర్సిటీలో వసతి యధావిధిగా కల్పించాలి. అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు దాదాపు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారని, వాళ్ళ దగ్గర ఎటువంటి మెస్ బిల్స్  తీసుకోవద్దని, అన్ని రకాల త్రాగునీటి  , పుస్తకాలు , విద్యుత్తు  సౌకర్యాలను  అందుబాటులో ఉంచాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్. యూ యూనివర్సిటీ నాయకులు ప్రిన్స్ ,దేవిక, శివ సాయి ,రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love