రైతుల పక్షపాతి కాంగ్రెస్..

Farmers bias Congress..– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ 

– రైతు రుణమాఫీపై కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు 
– మండల కేంద్రంలో రైతు ఎండ్ల బండ్లతో భారీ ర్యాలీ 
నవతెలంగాణ – బెజ్జంకి 
రూ.2 లక్షల రుణమాఫీకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం హర్షనీయమని..రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం సువర్ణ అక్షరాలతో రైతుల హృదయాల్లో చిరస్థాయిలో నిలుస్తోందని బ్రాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లపై రైతు ఎండ్ల బండ్లతో రైతు వేదిక అవరణం వద్ద వరకు భారీ ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,లింగాల శ్రీనివాస్,అక్కరవేణి పోచయ్య,పులి క్రిష్ణ,మంకాల ప్రవీన్,గూడెల్లి శ్రీకాంత్,పులి రమేశ్,చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,మధు సూధన్ రెడ్డి,చెన్నారెడ్డి,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,కాంగ్రెస్ శ్రేణులు,అయా గ్రామాల రైతుల పాల్గొన్నారు.
రైతు వేదికలో సీఎం ప్రసంగం వీక్షణ..
అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదిక అవరణంలో మండల వ్యవసాయశాఖ అధికారి సంతోష్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వార మండలంలోని అయా గ్రామాల రైతులు వీక్షించారు.ఏఈఓలు రేణుకా శ్రీ,మౌనిక,రచన,శ్వేత, భరత్,సాయి చరణ్,సాయి శంకర్ హజరయ్యారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పట్టణంలోని రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలును ప్రారంభించిన సందర్భంగా మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అధ్వర్యంలో రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి,వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు,మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటానికి రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు.
Spread the love