నవతెలంగాణ – బొమ్మలరామారం
నల్లగొండ -వరంగల్ -ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా మండల వ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమం మంగళవారం యు.టి.ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య మాట్లాడుతు…ఉపాధ్యాయ, ఉద్యోగుల పెండింగ్ డి, ఎ లను విడుదల చేయాలనీ, ఆర్ధిక పరమైన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలనీ, ప్రభుత్వ విద్యా రంగంలోని వివిధ స్థాయిలలో గల పోస్టులను భర్తీ చేయాలని, కామన్ సర్వీస్ రూల్స్ రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీగా మరోసారి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర్ల యాదయ్య, మోడల్ స్కూల్స్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిల్వర్ మహేష్, సీనియర్ నాయకులు పి సుదర్శన్ రెడ్డి, డి.వి.రిషి,పి.బిక్షమయ్యలు తదితరులు పాల్గొన్నారు.