– రాజకీయ శాస్త్ర విభాగంలో పట్టాను అందుకున్న నాగపూరి డాన్
నవతెలంగాణ-హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలానికి చెందిన నాగపూరి డాన్ విద్యారంగంలో విశేషమైన విజయాన్ని సాధించారు. వ్యవసాయ ఆధారిత సాధారణ కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆయన.. ఉస్మానియా విశ్వ విద్యాలయం (ఓయూ) నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించిన ఆయన ఒక క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ఈ ఘనతను అందుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో పెరిగిన నాగపూరి డాన్ చిన్ననాటి నుంచే చదువుపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. పరిమిత వనరులు, అనేక సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ఉన్నత విద్య వైపు అడుగులు వేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ ఎం. రమణ మార్గదర్శకత్వంలో డాన్ తన పరిశోధనను పూర్తి చేశారు. ‘E-Governance and Local Bodies: A Case Study in Nagarkurnool District” అనే అంశంపై సమగ్ర పరిశోధన చేసి థీసిస్‌ను సమర్పించారు.
ఈ పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు కృషి, పట్టుదలతో ఉన్నత విద్యలో అత్యున్నత అర్హతలలో ఒకటైన డాక్టరేట్‌ను సాధించడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని నింపింది. డాన్‌కు డాక్టరేట్ పట్టా లభించడం పట్ల పెంట్లవెల్లి మండల ప్రజలు, మిత్రులు, సామాజిక కార్యకర్తలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి విద్యా వేదికల వరకు ఎదగడం యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విశ్వాసం ఉంచి, నిరంతర కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నాగపూరి డాన్ విజయగాథ మరోసారి నిరూపించింది. గ్రామీణ యువతకు ఆయన సాధించిన ఈ ఘనత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
పెంట్లవెల్లి వాసికి ఓయూ నుంచి డాక్టరేట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



