దొంగతనాలు చేస్తున్న వ్యక్తులు అరెస్ట్‌

నవతెలంగాణ-హయత్‌ నగర్‌
దష్టి మళ్లించి దొంగతనానికి పాల్ప డిన నిందితులను శుక్రవారం చైతన్య పురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్‌ బి నగర్‌ లో ఉన్న తన క్యాంప్‌ కార్యాలయంలో జోన్‌ డీసీపీ సాయి శ్రీ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఏ-1:- జగన్‌ , ఏ-2:- కిరణ్‌, ఏ-3: యత్వన్‌, ఏ-4:- అప్పు అలియాస్‌ మోహన్‌ రాజ్‌లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. పార్కింగ్‌ చేసిన వాహనాలను ఎంపిక చేసుకొని 10, 20 రూపాయల నోట్లను తీసుకొని రోడ్ల పై డ్రైవర్‌ వైపు వెదజల్లి ఆ నోట్ల ను తీసుకోవడానికి డ్రైవర్‌ డోర్‌ తీసుకొని దిగినప్పుడు అవతిలి వైపు నుండి మరో వ్యక్తి వచ్చి కారులోఉన్న వస్తువులను తీసుకొని పరరావుతారు. ఈ నేపథ్యంలో ఒక నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని రిమాండ్‌ కు తరలిస్తున్నామన్నారు.మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుండి 30.1తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఎల్‌బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్‌ రెడ్డి, చైతన్య పురి ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ లు ఉన్నారు. అదేవిధంగా సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న గుడులల్లో దొంగతనాలకు పాల్పడిన హస్తినాపురం కు చెందిన మనోజ్‌ కుమార్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుండి రూ. 6550నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌ కు తరలించినట్లు వెల్లడించారు.

Spread the love