అత్తింటి వేధింపులే కారణమని
మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపు నగర్ లో విషాదం చోటుచేసుకుంది. 15 రోజుల క్రితమే పెండ్ల యిన ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నితీష (25) అనే యువతికి 15 రోజుల క్రితమే సంతోష్ రెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే గురువారం రాత్రి పుట్టింటికి వచ్చి ఆమె.. రాత్రి 11 గంటల సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్ప డింది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో గహిణి..
బాలానగర్ : అనుమానస్పద స్థితిలో ఓ గృహిణి మృతి చెందింది. ఈ దాంతో ఇద్దరు చిన్నారులకు తల్లి ప్రేమ దూరమయ్యింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. సీఐ కె.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం గిరినగర్ కు చెందిన పి.లక్ష్మి(30), పరశురామ్ లకు 12 ఏండ్ల క్రితం పెండ్లయింది. వీరికి ఐదు, ఎనిమిదేండ్ల వయస్సున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఇటీవల స్వగ్రామమైన జనగామకు వెళ్లారు. భర్త సొంత మేనబావ అయినప్పటికీ కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా వీరి మధ్య మరల ఘర్షణ జరగడంతో భర్త బయటికి వెళ్లగానే లక్ష్మి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. మధ్యాహ్న సమయంలో భార్యకు భర్త ఫోన్ చేయగా ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా గడియపెట్టి ఉంది. కిటికీ నుంచి చూడగా లోపల భార్య లక్ష్మి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి భార్యను కిందికి దించగా అప్పటికే మతి చెందింది. గొడవల కారణమా? లేక ఆత్మహత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని మతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తే విచారణలో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా అనుమానాస్పద మతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.