సిరివెన్నెల రసవాహిని ఆవిష్కరణోత్సవం

నవతెలంగాణ-సిటీబ్యూరో
‘సిరివెన్నెల రసవాహిని’ పుస్తక ఆవిష్కరణోత్సవం శుక్రవారం హైదరాబాద్‌ రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. సభకు అధ్యక్షత వహించిన హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సినీ గేయకవుల్లో అశ్లీలత, జుగుప్స లేకుండా పాటలను శుచిగా, మంచిగా రాసిన ఏకైక కవి సిరివెన్నెల అని ప్రశంసించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు డాక్టర్‌ కె.వి.రమణ పుస్తకాన్ని ఆవిష్కరించి దాని విశిష్టతను వివరించారు. ఈ కృతిని స్వీకరించిన సన్‌షైన్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ ఏ.వి. గురవారెడ్డి మాట్లాడుతూ.. సిరివెన్నెల తనకు అత్యంత ఆత్మీయులని, ఆయన సినీగీతాలపై వెలువడిన ఈ విశ్లేషణ గ్రంథాన్ని అంకితం తీసుకోవడం తన అదృష్టం అన్నారు. సినీ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు సినీ గేయ కవుల చరిత్రలో ‘సిరివెన్నెల’ గురించి రాయడానికి పేజీలు చాలవని, పెద్ద పుస్తకమే రాయాలని, ఆ పని చేసినందుకు డాక్టర్‌ పైడిపాలను మనసారా అభినందిస్తున్నానన్నారు. ప్రముఖ సినీ రచయిత తోటపల్లి సాయినాథ్‌ పాటల్లోని ప్రత్యేకతలను విశ్లేషిం చారు. గ్రంథకర్త డాక్టర్‌ పైడిపాల మాట్లాడుతూ ఈ పుస్తకం రాయడానికి కారణమైన నేపథ్యాన్ని తెలియ జేశారు. కిన్నెర ఆర్ట్స్‌ కార్యదర్శి మద్దాళి రఘురాం తమ సంస్థ తరపున అతిథులను సత్కరించింది. సభా ప్రారం భానికి ముందు వై.ఎస్‌. రామకృష్ణ బృందం సిరివెన్నెల గీతాలను మధురంగా ఆలపించారు.

Spread the love