దేశ ప్రజల స్వాతంత్రయాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలీ

– సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ
నవ తెలంగాణ – అడిక్ మెట్
దేశ ప్రజల స్వాతంత్రయాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలీ అని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకుడు డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రాత్రి సమయంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సంయుక్తా కిషన్ మోర్చా నాయకులు పశ్యపద్మ హాజరై మాట్లాడుతూ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజల స్వాతంత్రాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.దేశ రైతంగా ని కీ ప్రధానమంత్రి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను-మద్దతు ధరలను గ్యారెంటీ చట్టం  రుణమాఫీ చట్టం చేయాలని పంటల బీమా పథకంలో కార్పోరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధానాన్ని సవరించి రైతులకు అనుకూలంగా మార్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాదులను విచ్ఛిన్నకర శక్తులను తరిమి కొట్టడానికి అనేకమంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని, రాజ్యాంగాన్ని రైతులు దేశ ప్రజలందరూ కాపాడుకోవటానికి సమన్వయం కావాలని  పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు బ్యాంకు రుణాలు లతో పాటు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని ధరణిలో దొర్లిన లోపాలను సవరించి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని రుణమాఫీలో రైతులకు భారంగా ఉన్న వడ్డీ చెల్లించడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పశ్యపద్మ, టీ సాగర్, వి. కోటీశ్వరరావు, మామిడాల బిక్షపతి, పుస్తెల సృజన, మూడు శోభన్ ,ప్రభు లింగం, అంజయ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love