లక్క పురుగులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు..


నవతెలంగాణ భువనగిరి రూరల్: లక్క, కొక్కుపురుగులతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటన మండల పరిధిలోని వీరవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో చందుపట్ల బ్యాంకు పరిధిలో గోదాములో శివ రైస్ మిల్ కు సంబంధించిన ధాన్యం బస్తాలను గోదాములో డంప్ చేశారు. వీరవెల్లి గ్రామంలో గోదాం జనావాసాల మధ్యలో ఉండడంతో గోదాంలో ఉన్న ధాన్యం కు సకాలంలో రైస్ మిల్ యజమానులు ధాన్యాన్ని మిల్లుకు తరలించకపోవడంతో లక్క, కోక్క పురుగులు వ్యాప్తి చెందాయి. పురుగులతో ప్రజలు అనారోగ్యంగా పడుతున్నారు పురుగులు పరిసర ప్రాంతంలోని ప్రజల ఇండ్లలోనికి చేరడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయాన్ని సొసైటీ దృష్టికి తీసుకు వెళ్లిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే గోదాం లో ఉన్న రైస్ మిల్లులకు తరలించారు చర్యలు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలికంగా పురుగుల నివారణకు మందులను పిచికారి చేయాలని కోరారు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం: సోకం రాజశేఖర్
రైతులకు సంబంధించి విత్తనాలు ఎరువులను సకాలంలో అందజేయడానికి కఠిన గోదాంలో రైస్ మిల్ యజమాని ధాన్యం ను నిల్వ చేయడం సరికాదని, ఆ ధాన్యాన్ని సకాలంలో మిల్లుకు తరలించకపోవడంతో లక్క, కొక్కుపురులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు సొసైటీ స్పందించి పురుగుల పురుగుల బెడద నుండి ప్రజలను రక్షించాలని కోరారు.

Spread the love