ఆక్రమ పట్టాను తొలగించాలని తహసీల్ధార్ కు వినతి 

– రామన్నగూడెం ఇండ్ల స్థలాల లబ్ధిదారులు
నవతెలంగాణ – నెల్లికుదురు 
ప్రభుత్వ భూమిని ఆక్రమంగా ఆక్రమించుకుని ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వ్యక్తిపై చట్టమైన చర్యలు తీసుకోవాలని రామన్నగూడెం గ్రామ ఇండ్ల స్థలాల లబ్ధిదారులు బండి సోమయ్య మైస రాములు మైస అంజయ్య వీరస్వామి బిక్షపతి సోమ నరసయ్య తోపాటు కొంతమంది గురువారం తాహిసిల్దార్ కు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందించే కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా రామన్నగూడెం గ్రామస్తులకు 1998లో కొంతమందికి ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారని కానీ వారికి పొజిషన్ చూపించకపోవడంతో నిర్మించుకోలేకపోయామని అన్నారు సర్వే నెంబర్ 62 లో రామన్నగూడెం గ్రామానికి చెందిన పాశం భాగ్యమ్మ భర్త వీరయ్య ఆక్రమంగా పట్టా చేయించుకుని ఇంటి నిర్మాణం చేపడానికి ప్రయత్నిస్తున్నాడని ఆక్రమ పట్టాను తొలగించి ఇంటి నిర్మాణం ఆపివేసి లబ్ధిదారులకు కేటాయించిన స్థలాన్ని ఇప్పియ్యాలని కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థలాల లబ్ధిదారులు
Spread the love