– వధూవరులకు అందజేసిన బీఆర్‌ఎస్ యువజన విభాగం నేతలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పాత పేరాయిగూడెం గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో వినూత్న కానుకతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నార్లపాటి వెంకటేశ్వరరావు-కన్నమ్మ దంపతుల కుమారుడు లక్ష్మణరావుకు మమతతో బుధవారం వివాహం జరిగింది. వధూవరులను ఆశీర్వదించేందుకు హాజరైన బీఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు పెట్రోల్, డీజిల్‌ను పెండ్లి కానుకగా అందజేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వారు అందించిన బాక్స్‌ను తెరిచి చూడగా అందులో రెండు సీసాల్లో పెట్రోల్, డీజిల్ ఉండటంతో వధూవరులతోపాటు అతిథులు ఆశ్చర్యపోయారు. ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈ గిఫ్ట్‌ను అందజేసినట్టు యువజన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షులు మోటూరి మోహన్‌తోపాటు కలపాల శ్రీనివాస్, రవి, గంగాధర్, శివ, రామారావు పాల్గొన్నారు.
పెండ్లి కానుకగా పెట్రోల్, డీజిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



