గిరిరాజ్ కాలేజ్ లో పీజీ పేద విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేయడం దారుణం 

– సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్   కోర్సులు గా మార్చాలి..
– పి.డి.ఎస్.యూ..
నవతెలంగాణ- డిచ్ పల్లి
గిరిరాజ్ కాలేజ్ లో పీజీ సెల్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేసి 36000 వేల ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం  పీజీ చదువుతున్న  విద్యార్థులకు ఇవ్వాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ అడ్మిన్ బిల్డింగ్ ముందు పిడి ఎస్ యూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి జి కాలేజీలో దాదాపు 90 శాతం మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారని, ప్రభుత్వ కాలేజీ లో రియంబర్స్మెంట్ డబ్బులు  వసూలు చేయడం ఏంటని, పీజీ  విద్యార్థులకు కోర్స్ ఫీజు సంవత్సరానికి 36000 వేలు ఉంటే ప్రభుత్వం కేవలం 20000 వేలు మాత్రమే ఇస్తుందని, మిగతా 16000 వేలు సంవత్సరానికి  విద్యార్థులులే కట్టాలని ప్రిన్సిపాల్ హుకుం జారీ చేశారని , ట్యూషన్ ఫీజు కట్టకపోతే పరీక్షల ఫీజులు కట్టించుకోవడంలేదని, విద్యార్థుల నుంచి ఫీజుల దోపిడీ చేస్తూ ఒక్క డిపార్ట్మెంట్ మెంట్ కి ఇద్దరే లెక్చరర్లు పాఠాలు చెబుతున్నారని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ లు పెట్టి సరిపడా లెక్చరర్స్ ,ల్యాబ్   సౌకర్యాలు లేకుండా విద్యార్థుల నుండి కట్టిన ఫీజులు ఎటుపోతున్నాయని ప్రశ్నించారు, వెంటనే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్  కోర్సులు గా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా కోశాధికారి దేవిక, యూనివర్సిటీ నాయకులు శివసాయి, రవీందర్, రామకృష్ణ, అక్షయ్, ఆకాష్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love