సిఈఐఆర్ యాప్ ద్వారా ఫోన్ అప్పగింత

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
పోగొట్టుకున్న సెల్ ఫోన్ సిఈఐఆర్ యాప్ ద్వారా గుర్తించి బాధితుడికి అందించినట్లు అక్బర్పేట్ భూంపల్లి ఎస్ఐ గంగారాజు తెలిపారు.గురువారం పొలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఎనగుర్తి గ్రామానికి చిన్న ముత్యాల సత్తయ్యకు చెందిన మొబైల్ ఫోన్ ఊరిలో జరిగిన ఫంక్షన్ లో నెల రోజుల క్రిత్రం తన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. దీంతో అతను భూంపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. సిఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ యాప్ లో సెల్ ఫోన్ వివరాలు నమోదు చేసి బ్లాక్ చేశారు. సెల్ ఫోన్ వినియోగిస్తున్న అతని ఫోన్ నెంబర్ వివరాలు పోలీసులకు తెలియడంతో వెంటనే అతడిని గుర్తించి అతని వద్ద నుంచి సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నామన్నారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడిని భూంపల్లి పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఎస్ ఐ గంగారాజు, క్రైమ్ కానిస్టేబుల్ సాయికృష్ణ ,సెల్ ఫోనును బాధితునికి అందజేశామన్నారు.

Spread the love