కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపు కోసం పైలెట్‌ భారీ వ్యూహం

Kasani Gnaneshwar– 29 నుంచి బషీరాబాద్‌లో ప్రచార యాత్ర ప్రారంభం
– చేవెళ్ల, వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యాచరణ
– భారీ బహిరంగ సభలతో ప్రజలను కలుసుకునే ప్రయత్నం
– కాసాని గెలుపును ఛాలెంజ్‌గా తీసుకున్న పైలట్‌ రోహిత్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల నాయకుల్లో టెన్షన్‌ మొదలవుతుంది. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ప్రత్యేక వ్యూహ రచనలు చేస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే దక్కించుకోవాలని ఆలోచనలో బీఆర్‌ఎస్‌ పార్టీ గట్టి ప్రయత్నం కొనసాగిస్తుంది. వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ మెజార్టీ వచ్చేందుకు ప్రత్యేక వ్యూహరచనలతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ మెజార్టీ ఓట్లు పడే విధంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. చేవెళ్ల పార్లమెంటు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపు కోసం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి అన్ని తానై చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో మమేకమవుతూ ముందుకు పోతున్నారు. చేవెళ్లలో కాసాని గెలుపే లక్ష్యంగా రోహిత్‌ రెడ్డి వ్యూహరచనలు చేస్తూ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు పోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడం కోసం ప్రత్యేక వ్యూహరచనలతో ఎప్పుడు లేని విధంగా భారీ బహిరంగ సభలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ఏర్పాట్లను ము మ్మరం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీజేపీలకు చుక్కలు చూపె ట్టేందుకు పైలెట్‌ ప్రత్యేక వ్యూహర చనలతో ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. కాసాని జ్ఞానేశ్వర్‌ గెలుపే లక్ష్యంగా ఈ నెల 29న తాం డూరు నియోజకవర్గంలోని బషీరా బాద్‌లో ప్రచార యాత్రను ప్రారంభి ంచనున్నారు. చేవెళ్ల పార్లమెంటు లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రజలను పార్టీ వైపు ఆకట్టుకునే విధంగా కార్యచరణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్లు లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. చేవెళ్ల పార్లమెంటులో జ్ఞానేశ్వర్‌ గెలుపు పైలట్‌ రోహిత్‌ రెడ్డి చాలెంజ్‌గా తీసుకున్నట్టు తెలుస్తుంది. చేవెళ్ల పార్లమెంటు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ కుటుంబానికి రోహిత్‌రెడ్డి కుటుంబానికి 30 ఏండ్ల స్నేహ బంధమే ఇందుకు బలమైన కారణమని తెలుస్తుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పైలెట్‌ భారీ బహిరంగ సభలను నిర్వహించి గెలిపిస్తే చేయబోయే పనులను వివరించనున్నట్టు తెలుస్తుంది. తాండూరు నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లను బీఆర్‌ఎస్‌ పార్టీకి పడేవిధంగా రోహిత్‌ రెడ్డి కార్యచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 29 నుంచి ప్రచార యాత్ర ప్రారంభం కానుంది. ప్రచార యాత్ర కార్యక్రమాన్ని సైతం భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Spread the love