ప్లాస్టిక్ రహిత మేడారం..

– 200 మంది గిరిజన ఆశ్రమం పాఠశాల విద్యార్థులతో ర్యాలీ
– పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ -తాడ్వాయి
స్వచ్ఛ మేడారం, మేడారం మహా జాతర 2024 నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ప్లాస్టిక్ రహితం – పర్యావరణ హితం, పరిశుభ్రరత  మేడారం మహా జాతర- 2024  నిర్వహణ భాగంగా ఐటీడీఏ  ఏటూరునాగారం ఆధ్వర్యంలో  200 గిరిజన  ఆశ్రమ పాఠశాల  విద్యార్థులతో  నిర్వహిచిన ర్యాలీ కార్యక్ర మానికి  ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మేడారం కు వచ్చే భక్తులందరూ ప్లాస్టిక్ రహిత సంచులను,  అనగా కాటన్ సంచులను మాత్రమే ఉపయోగించాలని సమాజంలో ఉన్నటువంటి వన్యప్రాణులకు, ప్రజలకు గాని హాని కలిగించేటటువంటి ప్లాస్టిక్ ను నిషేధించాలని తెలిపారు. మేడారం జాతర ప్లాస్టిక్ రహిత జాతరగా విజయవంతంగా నిర్వహించుటకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరు  ఈ యొక్క సమాచారాన్ని ప్రజలకు అందరికీ  అదేవిధంగా  చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటిడిఏ పిఓ అంకిత్,  అడిషనల్ కలెక్టర్  శ్రీజ, పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు వివిధ శాఖల అధికారులు, పూజారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love