రైలుప్రమాద బాదితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన పీఎంఓ

నవతెలంగాణ – కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌‌లో రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వాలని నిర్ణయించింది. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Spread the love