Sunday, May 3, 2026
E-PAPER
Homeసినిమా'పోలీస్‌ కంప్లైంట్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘పోలీస్‌ కంప్లైంట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటిస్తున్న మరో భిన్న చిత్రం ‘పోలీస్‌ కంప్లైంట్‌’. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్‌ చంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో డైరెక్టర్‌ సంజీవ్‌ మేగోటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు.
ఈ మూవీ ఈనెల 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన కృష్ణసాయి బర్త్‌ డే సందర్భంగా తన అభిమాన నటుడు సూపర్‌ స్టార్‌ కష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెషల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ,’ ‘చైన్‌ రియాక్షన్‌ ఆఫ్‌ కర్మ’ అనే కాన్సెప్ట్‌ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఇదొక అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. దీనికి హర్రర్‌, థ్రిల్లర్‌ అంశాలను జోడించి ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం. ఈ సినిమా కథ, పాత్రల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అలరిస్తుందన్న నమ్మకం ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -