ఓట్ల కోసం గిరిజనేతరుల ను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలు

 – ఆదివాసి సంఘాల ఐక్య వేదిక
నవతెలంగాణ -తాడ్వాయి : ఓట్ల కోసం గిరిజనేతర్లను రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆదివాసి సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. సోమవారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ హాట్స్ లో ఆదివాసి సంఘాల ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరుల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వారినీ మభ్య పెట్టి మోసం చేస్తున్నారని దీనిని గిరిజనేతరులు గ్రహించాలని ఆదివాసి సంఘాల ఐక్య వేదిక నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆదివాసి గూడెలలో గిరిజన, గిరిజనేతరులు కలిసి జీవనం సాగిస్తున్నారని, కలిసి ఉండే మనుషుల మధ్య రాజకీయ పార్టీలు చిచ్చు పెట్టి ఓట్లను విబజించి పబ్బం గడుపుతున్నాయని మండిపడ్డారు. ఏజెన్సీలో ఆదివాసి జనాభా కంటే వారి భూములు తక్కువని, గిరిజనేతరుల జనాభా కంటే వారి భూములు ఎక్కువని, ఏజెన్సీలో ఉన్న భూముల్లో 80% శాతం గిరిజనేతరుల చేతుల్లోనే ఉన్నాయని, వారి భూములు ఆస్తులు పెంచుకుంటూ,మల్ల భూములు గుంజుకుంటారని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పచ్చని ఆదివాసి గూడే లలో రాజకీయాల పేరు తో చిచ్చు రేపుతున్నారని దీనిని గిరిజనేతరులు గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆదివాసి సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ లు కొప్పుల రవి, మడి సాయి బాబా, సిద్దబోయిన సర్వేశ్, పునెం రాములు సమన్వయ కర్త కబ్బాక శ్రావణ్ కుమార్, తుడుం దెబ్బ జిల్లా నాయకులు కోరగట్ల లక్ష్మణ్ రావు, కుంజ నారాయణ, కొర్నిబెళ్ళి గణేష్, ఆదివాసి సీనియర్ నాయకులు ఈసం యాదయ్య, పొదెం నాగేశ్వర్ రావు, పాయం కోటేశ్వరావు, ఎట్టి సారయ్య, చర్ప లక్ష్మి నారాయణ, గుండ్ల పాపారావు, అన్నెబోయిన సమ్మయ్య, కొర్నిబెల్లి విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Spread the love