మరి కాసేపట్లో తెలంగాణలో పోలింగ్

Electionsనవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్‌ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కానుంది. సిబ్బంది బుధవారం సాయంత్రానికి ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో నిలిచిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయించనున్నారు. ఇప్పటికే పోలింగ్‌ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నవతరం ఓటు హక్కు వినియోగించుకోనుంది. 18-19 సంవత్సరాల మధ్య ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ లేరు. ఈ వయసులో ఉన్న 9,99,667 మందికి ఓటు హక్కు లభించింది. ప్రవాస (ఎన్‌ఆర్‌ఐ) ఓటర్లు అత్యధికంగా 2,944 మంది నమోదయ్యారు.

Spread the love